వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008 | కామన్వెల్త్ క్రీడలు 2010
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జపాన్ ఓపెన్‌పై కన్నేసిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్! (Japan Open | Rafel Nadal | Tennis | Sports | Novak Jankovic)
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జపాన్ ఓపెన్‌పై కన్నేశాడు. గత నెలలో జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో రఫెల్ నాదల్ నోవాక్ జకోవిచ్ చేతిలో ఖంగుతిన్న నేపథ్యంలో, ఇదే ఓటమిని మరోసారి చవిచూడకూడదని నాదల్ భావిస్తున్నాడు. 25 ఏళ్ల స్పానియర్డ్ ఈ సారి జపాన్ ఓపెన్‌లో మెరుగ్గా రాణించి నోవాక్ జకోవిక్‌ను మట్టికరిపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

ఈ సందర్భంగా రఫెల్ నాదల్ మాట్లాడుతూ, జపాన్ ఓపెన్‌ బరిలోకి దిగడం ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా మెరుగ్గా రాణించేకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. జపాన్ ఓపెన్‌లో ఆడటం కీలకం, అంతేగాకుండా తన కెరీర్‌లో ఇది మెగా టోర్నీ. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో నిమగ్నమైన తాను టోర్నీలోనూ మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తానని నాదల్ వెల్లడించాడు.
సంబంధిత సమాచారం
దీన్ని కూడా శోధించు: జపాన్ ఓపెన్, రఫెల్ నాదల్, టెన్నిస్, క్రీడలు, నోవాక్ జకోవిచ్