ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ : మేరీ కోమ్ శుభారంభం (World Boxing Championship | Mary kom | pre Quarter Finals)
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ : మేరీ కోమ్ శుభారంభం
సోమవారం, 14 మే 2012( 10:41 IST )
FILE
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ మణిపూర్ మణిపూస మేరీ కోమ్ శుభారంభం చేసింది. చైనాలోని క్విన్‌హువాంగ్డోలో జరుగుతున్న ఈ టోర్నీలో లండన్ ఒలింపిక్స్‌కు బెర్తును ఖరారు చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగి తొలి రౌండ్‌లో బై సాధించిన మేరీ కోమ్ ఫ్లైవెయిట్ (51 కిలోల) విభాగం రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన అయాకో మిన్నోవాను సునాయాసంగా చిత్తుచేసి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన మేరీ కోమ్ (29)ను ఏమాత్రం ప్రతిఘటించలేకపోయిన మిన్నోవా 20-9 పాయింట్ల తేడాతో మట్టికరిచింది. మంగళవారం జరిగే ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో మేరీ కోమ్ నార్వేకి చెందిన మారియెల్లీ హాన్సెతో తలపడనుంది.