భారత బాక్సింగ్ వీరుడు విజేందర్ కుమార్ బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. సెమీస్‌లో వెనుతిరగడం ద్వారా 75 కేజీల బాక్సింగ్ విభాగంలో విజేందర్‌కు కాంస్యం దక్కనుంది. బీజింగ్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన 75 కేజీల మిడిల్ వెయిట్ క్వార్టర్స్ పోరులో క్యూబా బాక్సర్ ఎమిలియో బాయెక్స్ చేతిలో 8-5 తేడాతో ఓడిపోవడం ద్వారా తాజా ఒలింపిక్స్‌లో విజేందర్ పోరు ముగిసినట్టైంది. నాలుగు రౌండ్లలో జరిగిన క్వార్టర్ పోరులో ప్రారంభంలో విజేందర్ తడబడ్డాడు. దీంతో తొలి రౌండ్‌లో 0-2 తేడాతో విజేందర్ వెనకబడ్డాడు.
అయితే రెండో రౌండ్‌లో ప్రత్యర్థిపై కాస్త ఆధిపత్యం ప్రదర్శించిన విజేందర్ 3-4 తేడాతో కాస్త పుంజుకున్నాడు. |