ఒలింపిక్ పోటీల్లో భాగంగా ఇప్పటికే ప్రారంభమైన పురుషుల ఫుట్‌బాల్ పోటీల్లో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. గురువారం జరిగిన లీగ్ పోటీల్లో బ్రెజిల్, అర్జెంటీనా, అమెరికాలు భోణీ కొట్టాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో మరికొన్ని మ్యాచ్‌లు డ్రాలుగా ముగిశాయి.
గ్రూప్-సి విభాగంలో గురువారం బెల్జియంతో తలపడిన బ్రెజిల్ 1-0 తేడాతో విజయం సాధించింది. అలాగే ఇటలీ 3-0 తేడాతో హోండురాస్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అమెరికా 1-0 తేడాతో జపాన్‌పై విజయం సాధించగా, ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది.
కాగా ఆస్ట్రేలీయా, సెర్బియాల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అలాగే కొరియా, కామెరున్ జట్ల మధ్య మ్యాచ్ 1-1తోనూ, నెదర్లాండ్స్, నైజీరియా జట్ల మధ్య మ్యాచ్ 0-0తోనూ డ్రాగా ముగిసింది.
|