ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బీజింగ్ ఒలింపిక్స్ : ఆసక్తికర అంశాలు
Munibabu
చైనా ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన బీజింగ్ ఒలింపిక్స్-2008కి సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఒలింపిక్స్‌ క్రీడలను నిర్వహించే అవకాశం లభించిన నాటి నుంచే చైనా ఇందుకోసం కనీవినీ ఎరుగని స్థాయిలో రంగం సిద్ధం చేసింది.

ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహించడం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిలో చైనాను సగర్వంగా నిలిపేందుకు ఆ దేశాధినేతలు తీసుకున్న చర్యలు అన్నీ ఇన్నీ కావు. ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడానికి అనుమతి లభించిన నాటినుంచే ప్రారంభ వేడుకలు నిర్వహించ తలబెట్టిన బర్ట్స్ నెస్ట్ స్టేడియంను నిర్మించడం ప్రారంభింది.

ఈ స్టేడియం సంపూర్ణంగా రూపుదిద్దుకోవడానికి నాలుగేళ్లు పట్టిందంటే చైనా ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ స్టేడియంను నిర్మించిందో అంచనా వేయవచ్చు. అలాగే ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి చైనా చేసిన మొత్తం ఖర్చు ఎంతో తెలుసా అక్షరాలా 43 బిలియన్ డాలర్లు (దాదాపు లక్షా 84 వేల కోట్ల రూపాయలు).

ఒలింపిక్ క్రీడల నిర్వహణ కోసం చైనా 35 స్టేడియాలను ఏర్పాటు చేసింది. వీటితోపాటు వివిధ దేశాలనుంచి వచ్చే క్రీడాకారులు, మీడియా ప్రతినిధులు, క్రీడాభిమానుల కోసం అనేక నిర్మాణాలను చేపట్టింది. వీటితోపాటు అనేక విషయాల్లో చైనా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఒలింపిక్స్ కోసం దేశంలోని అనేక విషయాల్లో చైనా మార్పులు, చేర్పులు చేపట్టింది.

1 | 2  >>  
మరిన్ని
08-08-08 రాత్రి 8 గం. 8 ని.. 8 సె... బీజింగ్ ఒలింపిక్స్
ఒలింపిక్ సంబరం : బీజింగ్ చేరిన దేశాధినేతలు
మోనికకు మద్దతు : మణిపూర్‌లో బంద్
బీజింగ్ ఒలింపిక్‌ను ఆటంక పరుస్తాం : టీఐపీ
అమెరికా బాక్సర్ రస్సెల్ ఒలింపిక్‌కు దూరం
ఒలింపిక్ ఫుట్‌బాల్ : బ్రెజిల్, అర్జెంటీనా భోణీ