బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాల సందర్భంగా భారత్ క్రీడాకారుల తరపున రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మువ్వనెల పతాకంతో మార్చ్ పాస్ట్ నిర్వహించాడు. భారత్ తరపున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న 56 మంది క్రీడాకారులు ఈ మార్చ్ పాస్ట్‌లో పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయ దోవతీ కట్టుతో రాథోడ్‌తో కలిసి మార్చ్ పాస్ట్ నిర్వహించిన భారత క్రీడాకారులకు గ్యాలరీలో కూర్చున్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ అభివాదం చేశారు. ఆమెతో పాటు భారత ఒలింపిక్ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ కూడా క్రీడాకారులకు అభివాదం చేశారు.
గత ఒలింపిక్స్‌లో భారత్‌కు వ్యక్తిగత పతకం అందించిన ఏకైక క్రీడాకారుడిగా రాథోడ్ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఆ అంశమే నేడు బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున జాతీయ పతాకాన్ని చేతబూని ముందు నడిచే అరుదైన అవకాశం రాథోడ్ సొంతమైంది.
|