ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రారంభమే పరాజయం : మహిళా షూటర్లు ఇంటిముఖం
బీజింగ్‌లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడల్లో భారత్ ప్రారంభమే పరాజయంతో మొదలైంది. శనివారం ఉదయం జరిగిన మహిళల 10 మీటర్ల షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారిణులు ఫైనల్స్‌కు అర్హత సాధించలేక పోయారు.

భారత్‌కు చెందిన అంజలీ భగవత్, అవనీత్ కౌర్ సిద్ధూలు తొలి రౌండ్‌లోనే విఫలం చెందడం ద్వారా టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఫైనల్ చేరడానికి అవసరమైన 400 పాయింట్లకు గాను అంజలి 393 పాయింట్లు సాధించడం ద్వారా 29వ స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అలాగే అవనీత్ కౌర్ సిద్ధూ సైతం 389 పాయింట్లతో 39వ స్థానంలో నిలిచి ఇంటిముఖం పట్టింది. దీంతో ఈ 10మీటర్ల షూటింగ్ విభాగంలో భారత్ పరాభవం పూర్తయ్యింది. అదేసమయంలో చెక్ రిపబ్లికన్ అయిన కటరియానా ఎమ్మూనస్ ఈ విభాగంలో 503.5 పాయింట్లు సాధించి స్వర్ణపతకం కైవసం చేసుకుంది.

అలాగే రష్యాకు చెందిన గల్కీనా రజత పతకాన్ని గెలుచుకోగా కోరేషియాకు చెందిన సంజెజెనా పెజ్‌కిక్ కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.

అయితే ఈ విభాగంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే విభాగంలో ఎథెన్స్ ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో నిలబడిన చైనాకు చెందిన డూ లీ ఫైనల్స్‌లో ఐదోస్థానంలో నిలబడి చైనీయులకు నిరాశమిగిల్చింది.
మరిన్ని
బీజింగ్ ఒలింపిక్స్ : జాతీయ పతాకంతో రాథోడ్
బీజింగ్ ఒలింపిక్స్ : ఆసక్తికర అంశాలు
08-08-08 రాత్రి 8 గం. 8 ని.. 8 సె... బీజింగ్ ఒలింపిక్స్
ఒలింపిక్ సంబరం : బీజింగ్ చేరిన దేశాధినేతలు
మోనికకు మద్దతు : మణిపూర్‌లో బంద్
బీజింగ్ ఒలింపిక్‌ను ఆటంక పరుస్తాం : టీఐపీ