బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ కొన్ని విభాగాల్లో సంతృప్తికరమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ కోవలో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ విజయేందర్ కుమార్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.
బాక్సింగ్ పోటీల్లో 75 కేజీల విభాగంలో పాల్గొన్న విజయేందర్ గాంబియా బాక్సర్ జాక్ బదావోతో తలపడ్డాడు. బాదావోను పడగొట్టడం ద్వారా విజయేందర్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఇక 81 కేజీల విభాగంలో భారత బాక్సర్ దినేష్ కుమార్ అల్జీరియా బాక్సర్ అబ్దెల్లాఫిద్ బెంచెబ్లాతో పోటీ పడాల్సి ఉంది.
|