ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్స్ పోటీలు: మూడో రౌండ్‌కు సైనా
FileFILE
చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో భారత యువ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన సత్తాను చాటింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఈ స్టార్ ప్లేయర్ ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన లారెసాపై 21-18, 21-10 స్కోరుతో విజయం సాధించింది. ఈ విజయంతో సైనా నెహ్వాల్ మూడో (ప్రీ క్వార్టర్) రౌండ్‌కు చేరుకుంది.

అంతకుముందు రష్యా క్రీడారిణి ఎల్లా కరాచ్‌కోవాతో జరిగిన తొలి రౌండ్ పోటీలో సైనా మంచి స్కోరుతో గెలుపొందిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో 21-9, 21-8 స్కోరుతో విజయం సాధించింది. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సైనా తన సర్వీస్‌లో మొత్తం 26 పాయింట్లను తన వశం చేసుకోవడం గమనార్హం. ప్రీ క్వార్టర్‌లో ప్రపంచ నంబర్ త్రీ, హాంకాంగ్ క్రీడాకారిణి చెన్ వాంగ్, స్లొవేకియా క్రీడాకారిణి ఎవా స్లాడెకోవాల మధ్య జరిగే పోటీ విజేతతో నెహ్వాల్ తలపడుతుంది.
మరిన్ని
బీజింగ్ ఒలింపిక్స్ : రెండో రౌండ్‌లో భారత బాక్సర్
ఒలింపిక్ ఎయిర్ పిస్టల్ పోటీలు : జంగ్ నిష్క్రమణ
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ : రెండో రౌండ్‌లో సైనా
బీజింగ్ ఒలింపిక్స్ : క్వార్టర్స్‌లో భారత ఆర్చర్స్
ఒలింపిక్ సైక్లింగ్ పోటీలు : స్పెయిన్‌కు స్వర్ణం
బీజింగ్ ఒలింపిక్స్ : రోయింగ్‌ క్వార్టర్స్‌లో భారత్