ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం : బింద్రాకు అభినందనల వెల్లువ
బీజింగ్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రాపై భారత్‌లో అభినందనల జల్లులు కురుస్తున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన క్రీడాకారుడు బింద్రా కావడంతో ప్రతి ఒక్కరూ అతని ప్రతిభకు నీరాజనాలు పడుతున్నారు.

సోమవారం బింద్రా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించిన విషయం తెలియగానే భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు అందజేశారు. అలాగా ప్రధాని మన్మోహన్ సైతం బింద్రాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఈ విషయమై చైనాలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడీ విలేకరులతో మాట్లాడుతూ భారత చరిత్రలో ఇది మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు. బింద్రా స్వర్ణం సాధించిన విషయం తెలియగానే కేంద్ర రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అతనికి జీవిత కాల రైల్వే పాస్‌ను ప్రకటించారు.
మరిన్ని
డోపింగ్ ఆరోపణలు : స్పానిష్ క్రీడాకారిణి ఔట్
ఒలింపిక్‌లో భారత్ మెరుపులు : క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
భారత్‌కు తొలి స్వర్ణ పతకం
ఒలింపిక్స్ పోటీలు: మూడో రౌండ్‌కు సైనా
బీజింగ్ ఒలింపిక్స్ : రెండో రౌండ్‌లో భారత బాక్సర్
ఒలింపిక్ ఎయిర్ పిస్టల్ పోటీలు : జంగ్ నిష్క్రమణ