బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా తనకు లభించిన విజయాన్ని దేశంలోని వందకోట్ల ప్రజలకు అంకితం చేస్తున్నట్టు అభినవ్ బింద్రా తెలిపారు. వందకోట్లమంది భారతీయుల ఆదరాభిమానాలు తనకు ఉండడం వల్లే తానూ ఈ విజయం సాధించగలిగానని బింద్రా పేర్కొన్నాడు.
బీజింగ్‌లో సోమవారం షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అనంతరం బింద్రా విలేకరులతో మాట్లాడుతూ ఈ విజయం తనకు చాలా సంతోషాన్ని కల్గిస్తోందని అన్నాడు. ఈ ఆనందాన్ని తాను దేశంలోని ప్రజలందరితో పంచుకుంటున్నట్టు బింద్రా పేర్కొన్నాడు.
బింద్రా స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిన వెంటనే ప్రముఖులందరూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. బింద్రాకు అభినందనలు తెలిపినవారిలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌తో సహా ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడీలు ఉన్నారు.
|