బీజింగ్ ఒలింపిక్స్ నుంచి భారత్‌కు మరో తీపి కబురు అందింది. భారత బాక్సింగ్ క్రీడాకారుడు జితేందర్ కుమార్ ఫ్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించడంగ ద్వారా తన సత్తా చాటాడు.
ఫ్లై వెయిట్ కేటగిరిలో తొలి రెండు రౌండ్లను గెలిచిన జితేందర్ మంగళవారం ఫ్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించడం ద్వారా పతక సాధనపై గురిపెట్టాడు. జితేందర్ మరో రెండు రౌండ్లలో విజయం సాధిస్తే పతకం సాధించడం ఖాయమని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ముందు ముందు జరిగే ఈ రెండు రౌండ్లు జితేందర్‌కు బాగా కష్టమైనవేనని కూడా వారు విశ్లేషిస్తున్నారు.
|