ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆట నుంచి నిష్క్రమణతో సానియా కంట కన్నీరు
ఆట, అందంతో యావత్ భారతాన్ని ఆకట్టుకున్న టెన్నీస్ బ్యూటీ సానియా మీర్జా కెరీర్‌లో వివాదాలకూ కొదవలేదు. ఒకానొక దశలో కెరీర్‌లో ఎవరూ ఎదుర్కోనని వివాదాలను సానియా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో ముందుకు సాగిపోయే సానియా తెగువ అందరికీ సుపరిచయమే.

అలాంటి సానియా కంట్లో కన్నీటి చెమ్మ కన్పిస్తే... సోమవారం అదే జరిగింది. కోట్లాది మంది అభిమానుల అంచనాల నడుమ బీజింగ్ ఒలింపిక్స్ తొలి రౌండ్‌లో అడుగుపెట్టిన సానియా ఆట మధ్యలోనే రిటైర్ హార్ట్‌గా వెనుతిరిగింది. సింగిల్స్‌లో సానియా పతకం సాధిస్తుందని అభిమానుల్లో ఆశలు లేకపోయినా ఒలింపిక్స్ పోటీల్లో తర్వాతి రౌండ్లకు చేరడం ద్వారా అభిమానుల ఆశలను కొంతైనా నెరవేరుస్తుందని అనుకున్నారు.

అయితే సోమవారం కథ అడ్డం తిరిగింది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే గాయం కారణంగా ఇక ఆడలేనంటూ సానియా వెనుతిరిగింది. ఈ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బెనెసోవాతో తలపడిన సోనియా తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయింది. అయితే రెండో సెట్‌ ప్రారంభమైన కొంత సేపటికే సానియా ఆట నుంచి నిష్క్రమించింది.

ఆ సమయంలో సానియా 1-2తో వెనకబడి ఉంది. ఆట నుంచి అర్థాంతరంగా వెనుతిరిగిన సమయంలో కంటి నుంచి ఉబుకుతున్న కన్నీటినీ తుడుచుకుంటూ కన్పించిన సానియా స్థితిని చూచిన అభిమానుల గుండెలు ఒక్కసారిగా బరువెక్కాయి. ఆట అనంతరం సానియా మాట్లాడుతూ గాయం కారణంగా అర్థాంతరంగా వెనుతిరగడం తనను చాలా బాధించిందని పేర్కొంది.

గాయం బాధను ఓర్చుకోవడం కోసం కొద్ది సేపటి క్రితం కూడా తాను ఇంజక్షన్ తీసుకున్నానని అయితే గ్రౌండ్‌లో సమర్థంగా కదలలేక పోయినందునే తాను వెనుతిరిగానని సానియా వివరించింది. ఆ సమయంలో సానియా కన్నీటిని ఆపుకోలేకపోవడం గమనార్హం.
మరిన్ని
ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ : చైనాకు మరో స్వర్ణం
ఒలింపిక్స్ బాక్సింగ్ : ఫ్రీ క్వార్టర్స్‌లో జితేందర్
ఒలింపిక్ స్విమ్మింగ్ : రేహాన్ నిష్క్రమణ
బీజింగ్‌లో భారత్ : షూటింగ్ నుంచి వెనుదిరిగిన రాథోడ్
ఒలింపిక్‌లో భారత్ : రెండో రౌండ్‌లో శ్రీధర్ నిష్క్రమణ
బీజింగ్ ఒలింపిక్స్ : క్యూబా దెబ్బకు యూఎస్ ఔట్