ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్స్ బాక్సింగ్ : రెండో రౌండ్‌లోకి అఖిల్
బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత బాక్సింగ్ క్రీడాకారుడు అఖిల్ కుమార్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించడం ద్వారా ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. బాంటమ్ వెయిట్ 54 కేజీల విభాగంలో తొలి రౌండ్‌లో ప్రత్యర్ధిని చిత్తు చేయడం ద్వారా అఖిల్ ఈ ఘనత సాధించాడు.

ఫ్రెంచ్ బాక్సర్ అలీ హల్లాబ్‌తో మంగళవారం సాయంత్రం జరిగిన పోరులో అఖిల్ 12-5 తేడాతో విజయం సాధించాడు. ప్రత్యర్థిపై ముష్టి ఘాతాలు కురిపించిన అఖిల్ ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకునే అవకాశం ఇవ్వక పోవడం గమనార్హం. దీంతో బాక్సింగ్ విభాగంలో ఇద్దరు భారతీయులు ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించినట్టైంది.

అంతకు ముందు మంగళవారం ఉదయం జరిగిన ఫ్లై వెయిట్ కేటగిరిలో తొలి రెండు రౌండ్లను గెలిచిన జితేందర్ ఫ్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మంగళవారం భారత టెన్సీస్ దిగ్గజాలు మహేష్ భూపతి, లియాండర్ పేస్‌లు టెన్నీస్ డబుల్స్ విభాగంలో రెండో రౌండ్‌కు ప్రవేశించారు.







మరిన్ని
ఒలింపిక్ టెన్నీస్ : పేస్, భూపతి శుభారంభం
ఒలింపిక్ స్విమ్మింగ్‌లో భారత్‌కు చుక్కెదురు
బీజింగ్ ఒలింపిక్స్ : ఫెల్ప్స్‌ ఖాతాలో మూడో స్వర్ణం
ఒలింపిక్స్ ఆర్చరీ : ప్రీ క్వార్టర్స్‌లో ప్రణీత ఓటమి
ఒలింపిక్స్‌లో విలియమ్స్ సిస్టర్స్ శుభారంభం
బీజింగ్ ఒలింపిక్స్ : షూటింగ్ నుంచి జంగ్ నిష్క్రమణ