చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన ఢిల్లీ కుర్రాడు అభినవ్ బింద్రాను భారతీయ రైల్వే బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సూచన ప్రాయంగా వెల్లడించారు. దీనిపై ఆయన న్యూఢిల్లీలో విలేకరుల మాట్లాడుతూ.. 10 ఎం రైఫిల్ ఫైరింగ్ విభాగంలో స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకున్న అభినవ్‌కు కేవలం నగదు బహుమతినే ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు.
అభినవ్‌కు వేరే రకమైన ప్రోత్సవహింక బహుమతులు కూడా ఇవ్వొచ్చన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యల వల్ల అభినవ్‌ను రైల్వే ప్రచారకర్తగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. రైల్వే శాఖలో మంచి ఉద్యోగం ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈ ఉన్నత ఉద్యోగం.. బహుశా అంబాసిడర్ బాధ్యతలే అయివుండవచ్చని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
|