ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్ టెన్సీస్ : క్వార్టర్స్‌లో పేస్, భూపతి జంట
బీజింగ్ ఒలింపిక్స్‌లో బుధవారం భారత్‌ టెన్సీస్ ద్వయం లియాండర్ పేస్, మహేష్ భూపతిల జంట క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. దీంతో బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం సొంతమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

పురుషుల డబుల్స్ టెన్నీస్ పోటీల్లో భాగంగా బుధవారం మార్సెలో మల్లోవ్, అండ్రే సాతో పేస్, భూపతిల జంట తలపడింది. హోరాహోరీగా సాగిన పోరులో 6-4, 6-2 తేడాతో పేస్, భూపతి జంట ప్రత్యర్థి జంటను ఖంగు తినిపించింది. దీంతో విజయవంతంగా పేస్, భూపతి జంట క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.

అంతకుముందు మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌ జంట గేల్ మాన్‌ఫిల్స్, గిల్సేస్ సిమోన్స్‌లతో తలపడి పేస్, భూపతిలు సునాయాస విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి రౌండ్‌లో ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన భారత జంట ప్రత్యర్ధిని 6-3, 6-3 తేడాతో చిత్తు చేసింది.
మరిన్ని
ఒలింపిక్ వైరాగ్యం : వైదొలిగే ఆలోచనలో రాథోడ్
రైల్వే ప్రచారకర్తగా 'అభినవ' భారతీయుడు..!
ఒలింపిక్ పదనిసలు : కుప్పుకూలిన హంగేరి క్రీడాకారుడు
బీజింగ్ ఒలింపిక్స్ : పెల్ప్స్ ప్రపంచ రికార్డు
ఒలింపిక్ ఆర్చరీ నుంచి భారత్ నిష్క్రమణ
ఒలింపిక్స్‌లో సైనా నిష్క్రమణ : భారత ఆశలపై నీళ్లు