చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో ప్రేక్షకుల సందడి మచ్చుకైనా కనిపించడం లేదు. ఫైనల్ పోటీల్లో మినిహా, ఇతర లీగ్ పోటీల్లో ప్రేక్షకులు స్టేడియాలకు తరలి రావడం లేదు. దీంతో స్టేడియాలు వెలవెలబోతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బీజింగ్‌లో ప్రతికూల వాతావరణం నెలకొన ఉండటమే.
ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో స్టేడియాలకు వచ్చేందుకు ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నారు. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘ ప్రతినిధులు సైతం పెదవి విరిచి, బీజింగ్ ఒలింపిక్ నిర్వాహకుల తీరును విమర్శలు చేశారు. దీనికి తోడు బీజింగ్‌లో అపుడపుడు పడుతున్న చిరుజల్లులు కూడా తీవ్ర అసౌకర్యానికి లోను చేస్తున్నాయి.
దీంతో స్పానర్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తాము పెట్టిన వేల కోట్ల రూపాయలను ఏ విధంగా రాబట్టుకోవాలన్న అంశంపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద బీజింగ్ వాతావరణం ఒలింపిక్ క్రీడా పోటీలకు తీవ్ర ఆంటకంగా నిలిచింది.
|