ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్‌లో శృంగారం : అందుబాటులో కండోమ్‌లు
ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం నిర్మించే ఒలింపిక్ గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పతకాల కోసం రేయింబవళ్లు శ్రమించే అథ్లెట్లు దేని కోసం వెతుక్కోకూడదనే ఈ ఏర్పాటు చేస్తారు. క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసే సౌకర్యాల్లో క్రీడలకు సంబంధించిన వస్తువులే కాక క్రీడాకారుల వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన వస్తువులు కూడా ఉంటాయి.

ఇలా వ్యక్తిగత అవసరాల కోసం ఉంచిన సౌకర్యాల్లో నిర్వాహకులు కండోమ్‌లను కూడా జత చేశారు. ఈ విషయమై నిర్వాహకులు మాట్లాడుతూ ఒలింపిక్ గ్రామంలో యవ్వన ప్రాయంలో ఉండే అనేకమంది క్రీడాకారులతో పాటు మరెంతో మంది ఉంటారు. ఈ సమయంలో వారి మధ్య ప్రేమలు ఏర్పడవచ్చు. అలాగే శృంగార పరమైన వాంఛలు కూడా ఏర్పడవచ్చు.

ఇలాంటి సమయాల్లో వారికి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండడం కోసమే కండోమ్‌లను ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. ప్రస్తుతం బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా దాదాపు లక్ష కండోమ్‌లను అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో నిర్వహించబడిన ఏథెన్స్ ఒలింపిక్స్‌లో వాడిన కండోమ్‌ల సంఖ్య కంటే ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
మరిన్ని
ఒలింపిక్ స్టేడియాల్లో కానరాని ప్రేక్షకులు  
ఒలింపిక్ టెన్సీస్ : క్వార్టర్స్‌లో పేస్, భూపతి జంట
ఒలింపిక్ వైరాగ్యం : వైదొలిగే ఆలోచనలో రాథోడ్
రైల్వే ప్రచారకర్తగా 'అభినవ' భారతీయుడు..!
ఒలింపిక్ పదనిసలు : కుప్పుకూలిన హంగేరి క్రీడాకారుడు
బీజింగ్ ఒలింపిక్స్ : పెల్ప్స్ ప్రపంచ రికార్డు