బీజింగ్ ఒలింపిక్స్ రోజర్ ఫెదరర్ గురువారం క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. గత ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన ఫెదరర్ బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రం పోరాడి మరీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.
బీజింగ్‌లో గురువారం జరిగిన హోరాహోరీ పోరులో చెక్ రిపబ్లిక్‌కు చెందిన థామస్ బెర్డిక్‌పై 6-3, 7-6 (4) తేడాతో విజయం సాధించడం ద్వారా ఫెదరర్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. బెర్డిక్ మీద విజయం ఫెదరర్‌కు మరుపురాని విజయం కానుంది.
ఎందుకంటే 2004 ఏథెన్స్ ఒలింపిక్ క్వార్టర్స్ అర్హత కోసం జరిగిన రెండో రౌండ్ పోరులో బెర్డిక్ చేతిలోనే ఫెదరర్ ఓడిపోవడం గమనార్హం. అందుకే బీజింగ్‌లో బెర్డిక్‌పై గెలిచిన వెంటనే ఫెదరర్ విజయ గర్వంతో ఎగిరి గంతేశాడు.
|