ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్ క్వార్టర్స్‌లో గెలవాల్సింది కానీ... : సైనా
బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకోవడం ద్వారా సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన ఓటమి పట్ల విచారం వ్యక్తం చేసింది. క్వార్టర్స్‌లో తాను ఓడి ఉండాల్సింది కాదని అది తన మ్యాచ్ అని కానీ... ఎందుకో మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయానని సైనా పేర్కొంది.

బీజింగ్‌లో బుధవారం క్వార్టర్స్‌లో ఓటమి అనంతరం సైనా మాట్లాడుతూ క్వార్టర్స్‌లో తాను చేసిన అనవసర తప్పిదాలే తనను ఓటమికి దగ్గర చేశాయని చెప్పింది. క్వార్టర్స్ తొలి సెట్‌లో తాను పైచేయి సాధించినా రెండో సెట్, మూడో సెట్‌లలో తన సహజసిద్ధమైన ఆటను కనబర్చలేక పోయానని సైనా పేర్కొంది.

ముఖ్యంగా మూడో సెట్‌లో తాను ఎక్కువగా తప్పులు చేసినట్టుగా సైనా వ్యాఖ్యానించింది. మూడో సెట్‌లో షటిల్ ఎక్కడ పడుతుందో అంచనా వేయడంలో తాను విఫలమైనట్టు సైనా తెలిపింది. ప్రత్యర్ధి కొట్టిన షాట్లలో చాలా వాటిని ఔట్ అవుతాయన్న ఉద్ధేశ్యంతో తాను వదిలేశాయని కానీ అవి లైన్ లోపల పడడంతో తన అంచనాలు తలక్రిందులయ్యాయని సైనా పేర్కొంది.

ఇవన్నీ కలిసి తన ఓటమిని ప్రభావితం చేశాయని సైనా వివరించింది. మరోవైపు ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ వరకు చేరుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనాను పలువురు అభినందిస్తున్నారు. ఇందులో భాగంగా క్వార్టర్స్‌కు చేరుకున్న సైనా నెహ్వాల్ ప్రదర్శనను అభినందిస్తూ జాతీయ నెట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు విగీశ్ పాఠక్ రూ. లక్ష నజరానాగా ప్రకటించారు.
మరిన్ని
ఫైనల్ ముందు బింద్రా గన్ పాడు చేశారు : అధికారులు
ఒలింపిక్ టెన్నీస్ : మహిళల డబుల్స్‌లో భారత్ ఔట్
ఒలింపిక్ టెన్నీస్ : క్వార్టర్స్‌లో ఫెదరర్
ఒలింపిక్ నుంచి స్వదేశం చేరిన 'స్వర్ణ' విజేత బింద్రా
ఒలింపిక్స్ : షూటింగ్‌లో భారత్‌కు చుక్కెదురు
ఒలింపిక్స్ టెన్నీస్ : క్వార్టర్స్‌లో నాధల్