భారత స్వాతంత్ర దినోత్సవ వేళ తన విజయాన్ని కానుకగా అందిస్తానని బాక్సర్ అఖిల్ కుమార్ పేర్కొన్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో శుక్రవారం ఫ్రీ క్వార్టర్ ఫైనల్‌లో తలపడనున్న అఖిల్ కుమార్ తన విజయం పట్ల పై విధంగా స్పందించాడు.
బీజింగ్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన అఖిల్ కుమార్ భారత స్వాతంత్ర దినోత్సవం, తన ముఖ్యమైన పోటీ ఒకే రోజు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. స్వాతంత్ర దినోత్సవ వేళ విజయం సాధించి దేశ ప్రజలకు సంతోషాన్ని కల్గిస్తానని అతను తెలిపాడు.
ప్రీ క్వార్టర్‌లో తన ప్రత్యర్థి, ప్రపంచ ఛాంపియన్ అయిన సెర్జ్‌తో తలపడనున్న విషయం గురించి అఖిల్ మాట్లాడుతూ ప్రత్యర్ధి ఎవరైనా విజయమే లక్ష్యంగా తాను బరిలో దిగుతానని పేర్కొన్నాడు. ప్రత్యర్ధి పేరు ప్రఖ్యాతలు విని తాను భయపడబోనని అఖిల్ స్పష్టం చేశాడు. ప్రత్యర్ధి రికార్డులు చూచి భయపడేవాడినైతే తాను బీజింగ్ వరకు వచ్చేవాడిని కాదని అఖిల్ అన్నాడు.
|