బీజింగ్ ఒలింపిక్స్‌లో అమెరికా ఈతగాడు మైకేల్ ఫెల్ప్స్ తన హవా కొనసాగిస్తున్నాడు. తొమ్మిది స్వర్ణాల లక్ష్యంతో బీజింగ్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన ఫెల్ప్స్ శనివారం నాటికి ఏడో స్వర్ణం సాధించి తనకెవరూ సాటిరారని నిపూపించాడు.
బీజింగ్‌లో శనివారం ఉదయం జరిగిన 100 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో విజయం సాధించడం ద్వారా ఫెల్ప్స్ స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో అత్యధికంగా స్వర్ణాలు సాధించిన స్విమ్మర్‌గా అమెరికన్ స్విమ్మర్ స్పిడ్జ్ నెలకోల్పిన రికార్డును ఫెల్ప్స్ సమం చేశాడు.
బీజింగ్‌లో ఫెల్ప్స్ కనుక మరో స్వర్ణం సాధించగల్గితే ఒలింపిక్ చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన ఈతగాడుగా రికార్డు సృష్టించగలడు.
|