బాక్సింగ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న భారత క్రీడాకారులు అఖిల్ కుమార్, జితేందర్ కుమార్‌లకు హర్యానా రాష్ట్రం భారీ నజరానా ప్రకటించింది. తమ రాష్ట్రానికి చెందిన బాక్సర్లు ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ వరకు చేరుకోవడాన్ని గొప్పగా భావించిన హర్యానా రాష్ట్రం వారిద్దరికి చెరో రూ. 25 లక్షలను నజరానాగా ప్రకటించింది.
ఏమాత్రం అంచనాలు లేకుండా బీజింగ్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అఖిల్ కుమార్, జితేందర్ కుమార్‌లు తొలి రెండు రౌండ్లలో సంచలన విజయాలు నమోదు చేయడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
బీజింగ్‌లో శుక్రవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో 54 కేజీల బాంటమ్ వెయిట్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ సెర్గీ వొడోపియనోవ్ (రష్యా)తో జరిగిన పోరులో అఖిల్ కుమార్ విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరాడు. అలాగే శనివారం జరిగిన పోరులో ఉబ్జెకిస్థాన్ బాక్సర్ తుల్షబాయ్ దొనియోరోవ్‌పై 51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో విజయం సాధించడం ద్వారా జితేందర్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.
|