బీజింగ్ ఒలింపిక్స్ బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్లు ఆశలు రేకెత్తిస్తున్నారు. శనివారం జరిగిన 75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో క్వార్డర్స్‌కు చేరుకోవడం ద్వారా విజేందర్ భారత అభిమానులను అనందింపజేశాడు.
థాయిలాండ్ బాక్సర్ అంగఖాన్‌తో జరిగిన పోరులో విజేందర్ విజయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దాదాపు ఏక పక్షంగా సాగిన ఈ పోరులో 13-3 తేడాతో అంగఖాన్‌ను విజేందర్ చిత్తు చేశాడు.
ఈ విజయంతో విజేందర్ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. బాక్సింగ్ విభాగంలో భారత్‌కు చెందిన అఖిల్ కుమార్, జితేందర్ కుమార్‌లు క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
|