బీజింగ్ ఒలింపిక్స్‌లో భాగంగా సోమవారం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్ పోటీల్లో భారత క్రీడాకారిణి నేహా అగర్వాల్ తొలిరౌండ్‌లోనే వెనుతిరిగింది. ప్రత్యర్థిని నిలువరించడంలో కాస్త పోరాటపటిమ ప్రదర్శించినా చివరకు నేహా వెనుతిరగడం గమనార్హం.
ఆట ప్రారంభమైన కేవలం 34 నిమిషాల్లోనే నేహా పరాజయం పూర్తయ్యింది. మహిళల సింగిల్స్ ప్రిలిమనరీ రౌండ్ పోటీల్లో భాగంగా నేహా ఆస్ట్రేలియాకు చెందిన జియాన్ ఫాంగ్‌తో పోటీ పడింది.
కాసింత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో నేహా ప్రత్యర్థి చేతిలో 12-10, 8-11, 11-13, 8-11, 4-11 తేడాతో పరాజయం చవిచూసింది. తద్వారా ఈ విభాగంలో భారత పోరు ముగిసినట్టైంది.
|