బీజింగ్ ఒలింపిక్స్ సెయిలింగ్ పోటీల్లో ఆస్ట్రేలియాకు పతకాల పంట పండింది. సెయిలింగ్ పోటీల్లోని మహిళల, పురుషుల విభాగాల్లోనూ ఆస్ట్రేలియా స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. సెయిలింగ్‌లోని 470 క్లాస్ విభాగంలో ఆస్ట్రేలియా ఈ ఘనతను సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ విల్మోట్, మాల్కోల్మ్ పేజ్‌లు సోమవారం జరిగిన సెయిలింగ్ 470 క్లాస్ పురుషుల విభాగంలో స్వర్ణం సొంతం చేసుకున్నారు. ఇదే విభాగంలో బ్రిటన్‌కు చెందిన నిక్ రోజర్స్, జాయ్ గ్లాన్ ఫీల్డ్‌లు రజత పతకాన్ని దక్కించుకున్నారు. ఇక కాంస్య పతకాన్ని ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ కార్మోనేర్, ఒలివియేర్‌లు దక్కించుకున్నారు.
మహిళల సెయిలింగ్ 470 క్లాస్ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎలిసే రెచిచీ, టెస్సా పార్కిన్‌సన్‌లు స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విభాగంలో డచ్‌కు చెందిన కొనింగ్, బెర్క్‌హౌట్‌లు రజతాన్ని గెల్చుకున్నారు. ఈ విభాగంలో రజత పతకాన్ని బ్రెజిల్ జంట గెల్చుకుంది.
|