బీజింగ్ ఒలింపిక్స్‌లో మంగళవారం అథ్లెటిక్స్, రెజ్లింగ్ విభాగాల్లో భారత్‌కు చుక్కెదురైంది. అథ్లెటిక్స్ విభాగంలో భారత ఆశాకిరణం అంజూ బాబీ జార్జ్ నిరాశపర్చగా రెజ్లింగ్ విభాగంలో యోగేశ్వర్‌దత్ క్వార్టర్స్‌లో ఓడిపోవడం ద్వారా ఇంటిముఖం పట్టాడు.
బీజింగ్‌లో మంగళవారం జరిగిన 60 కేజీల రెజ్లింగ్ విభాగంలో జపాన్‌కు చెందిన కెనిచీ యుమోటోతో జరిగిన పోరులో యోగేశ్వర్ ప్రారంభ రౌండ్లో ఆకట్టుకున్నా చివరకు ఓటమి చవిచూశాడు. తొలి రౌండ్‌లో యోగేశ్వర్ 1-0 తేడాతో ఆధిక్యం కనబరిచినా మూడో రౌండ్ పూర్తయ్యే సరికి 2-1తో వెనకబడి ఫైనల్‌కు చేరే అర్హత కోల్పోయాడు.
మరోవైపు అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మహిళల లాంగ్ జంప్ ఫైనల్స్ అర్హత పోటీల్లో అంజూ బాబీ జార్జ్ ఓటమి చెందింది. అంజూ స్కోరు నమోదు చేయకుండానే పోటీనుంచి వెనుదిరగడం గమనార్హం. అంజూ నిష్క్రమణతో అథ్లెటిక్స్‌లో భారత పతకం ఆశలు దాదాపు గల్లంతయ్యాయి.
|