ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్వర్ణ విజేత బింద్రాకు కేంద్ర ప్రభుత్వ నజరానా
బీజింగ్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత షూటర్ అభినవ్ బింద్రాకు లభిస్తున్న నజరానాల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బింద్రాకు రూ. 50 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ నగదు బహుమతిని అర్జున అవార్డుల కార్యక్రమంలో బింద్రాకు అందించనున్నారు.

ఈ విషయమై క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన చేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తెచ్చిన క్రీడాకారులకు ఈ నగదు బహుమతిని ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇది వరకు ఇస్తున్న నగదు బహుమతి విలువను సైతం ఈ సందర్భంగా భారీగా పెంచారు.

కేంద్ర క్రీడల మంత్రి గిల్ చేసిన అభ్యర్థన ప్రకారం ఆర్థికశాఖ నగదు బహుమతుల విలువను పెంచింది. దీని ప్రకారం ఇదివరలో స్వర్ణ పతక విజేతకు ఇస్తున్న రూ. 20లక్షల స్థానంలో రూ. 50 లక్షలు అందించనున్నారు. అలాగే రజత పతక విజేతకు రూ. 18 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు. ఇక కాంస్య పతక విజేతకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 లక్షలకు నగదు బహుమానాన్ని పెంచారు.
మరిన్ని
ఒలింపిక్ బాస్కెట్ బాల్ : సెమీస్‌ చేరిన చైనా
ఒలింపిక్ పోల్ వాల్ట్‌లో రష్యా ప్రపంచ రికార్డ్
ఒలింపిక్స్‌లో భారత్ : టీటీలో శరత్ ముందంజ
ఒలింపిక్ స్వర్ణ వీరుడు బింద్రాకు భారీ నజరానా
అథ్లెటిక్స్, రెజ్లింగ్‌లో భారత్‌కు చుక్కెదురు
బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ముగిసిన అఖిల్ పోరు