ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్‌లో భారత్ : ముగిసిన శరత్ ముచ్చట
బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత ముచ్చట ఒక్కొక్కటిగా నీరుగారి పోతోంది. ప్రారంభంలో దూకుడు ప్రదర్శిస్తున్న భారత క్రీడాకారులు పతకం సాధించే దిశగా మాత్రం పురోగతి సాధించలేక పోతున్నారు. తాజాగా ఆ జాబితాలో టెబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కూడా చేరాడు.

బీజింగ్‌లో బుధవారం జరిగిన టెబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో శరత్ రెండో రౌండ్‌లో ఓటమి చెందడం ద్వారా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఈ విభాగంలో భారత పోరు పూర్తయ్యింది. ఆస్ట్రియాకు చెందిన చెన్ వీ జింగ్‌తో జరిగిన రెండో రౌండ్ పోరులో శరత్ ఓటమి చవిచూశాడు.

దాదాపు 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో శరత్ 5-11, 12-14, 2-11, 11-8, 10-12 స్కోరు తేడాతో ఓడిపోయాడు. బీజింగ్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో శరత్ రెండో రౌండ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ తొలి రౌండ్ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాడు కామెరోన్‌ను ఓడించడం ద్వారా శరత్ అందరి దృష్టినీ ఆకర్షించాడు.
మరిన్ని
స్వర్ణ విజేత బింద్రాకు కేంద్ర ప్రభుత్వ నజరానా
ఒలింపిక్ బాస్కెట్ బాల్ : సెమీస్‌ చేరిన చైనా
ఒలింపిక్ పోల్ వాల్ట్‌లో రష్యా ప్రపంచ రికార్డ్
ఒలింపిక్స్‌లో భారత్ : టీటీలో శరత్ ముందంజ
ఒలింపిక్ స్వర్ణ వీరుడు బింద్రాకు భారీ నజరానా
అథ్లెటిక్స్, రెజ్లింగ్‌లో భారత్‌కు చుక్కెదురు