ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్ మారథాన్ స్విమ్మింగ్ విజేత ఇల్చెంకో
బీజింగ్ ఒలింపిక్‌లో బుధవారం జరిగిన మారథాన్ స్విమ్మింగ్ పోటీల్లో రష్యా క్రీడాకారిణి లారిసా ఇల్చెంకో విజయం సాధించింది. తద్వారా మహిళల 10 కిలోమీటర్ల ప్రారంభ మారథాన్ స్విమ్మింగ్‌లో స్వర్ణం సాధించిన రష్యా క్రీడాకారిణిగా ఇల్చెంకో రికార్డు సృష్టించింది.

బీజింగ్‌లో బుధవారం జరిగిన ఈ పోటీల్లో ఇల్చెంకో గంటా 59 నిమిషాల 27 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ విభాగంలో బ్రిటన్‌కు చెందిన పయ్‌నే గంటా 59 నిమిషాల 29 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా రజత పతకాన్ని గెలుపొందింది.

ఈ విభాగంలో కాంస్య పతకం సైతం బ్రిటన్ ఖాతాలోనే చేరింది. బ్రిటన్‌కు చెందిన పట్టెన్ గంటా 59 నిమిషాల 31 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా కాంస్యాన్ని గెల్చుకుంది.
మరిన్ని
బీజింగ్‌లో నేడు జితేందర్, విజేందర్‌ల క్వార్టర్స్ పోరు
ఒలింపిక్‌లో భారత్ : ముగిసిన శరత్ ముచ్చట
స్వర్ణ విజేత బింద్రాకు కేంద్ర ప్రభుత్వ నజరానా
ఒలింపిక్ బాస్కెట్ బాల్ : సెమీస్‌ చేరిన చైనా
ఒలింపిక్ పోల్ వాల్ట్‌లో రష్యా ప్రపంచ రికార్డ్
ఒలింపిక్స్‌లో భారత్ : టీటీలో శరత్ ముందంజ