బీజింగ్ ఒలింపిక్స్ నుంచి భారత్‌కు మరో శుభవార్త చేరింది. ఒలింపిక్ రెజ్లింగ్ పోటీల్లో భారత క్రీడాకారుడు సుశీల్‌కుమార్ కాంస్య పతకాన్ని అందించడం ద్వారా భారత క్రీడాభిమానులకు సంతోషాన్ని కల్గించాడు.
బీజింగ్‌లో బుధవారం జరిగిన 66 కేజీల రెజ్లింగ్ విభాగంలోని టెక్నికల్ రౌండ్‌లో అమెరికాకు చెందిన డౌగ్ స్కెవబ్‌ను ఓడించడం ద్వారా సుశీల్ కుమార్ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు.
రెపిచేజ్ మ్యాచ్‌లో 3-1 తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించడం ద్వారా బీజింగ్ ఒలింపిక్‌లో సుశీల్ కుమార్ భారత్‌కు రెండో పతకాన్ని అందించాడు. అంతకుముందు షూటర్ అభినవ్ బింద్రా 10 మీటర్ల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే.
|