ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్ కాంస్య విజేత సుశీల్‌కు నజరానాల వెల్లువ
బీజింగ్ ఒలింపిక్‌ రెజ్లింగ్ పోటీల్లో బుధవారం కాంస్యం సాధించిన సుశీల్ కుమార్‌కు భారత వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో భారీ నజరానాలు సైతం సుశీల్ తలుపులు తడుతున్నాయి.

రెజ్లింగ్ విభాగంలో సుశీల్ కాంస్య పతకాన్ని గెలిచాడన్న విషయం తెలియగానే రైల్వే ఉద్యోగి అయిన అతనికి ఆ శాఖ నజరానాలు ప్రకటించింది. సాధారణ ఉద్యోగిగా ఉన్న సుశీల్‌కు అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్‌గా పదోన్నతి ఇవ్వడంతో పాటు రూ. 55 లక్షల నగదు బహుమతి కూడా ఇవ్వనున్నట్టు రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు.

అదేసమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షీత్ సైతం సుశీల్ కుమార్‌కు రూ. 50 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. బీజింగ్‌లో సోమవారం జరిగిన 66 కేజీల పురుషుల రెజ్లింగ్ పోటీల్లోని ఫ్రీస్టైల్ విభాగంలో జరిగిన రెపిచేజ్ మ్యాచ్‌లో కజికిస్థాన్‌కు చెందిన స్పిరిదినోవ్‌ను ఓడించడం ద్వారా కాంస్యాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

తద్వారా రెజ్లింగ్ విభాగంలో 56ఏళ్ల తర్వతా భారత్‌ తరపున పతకం సాధించిన రెజ్లర్‌గా సుశీల్ రికార్డు సృష్టించాడు. సుశీల్‌కు ముందు రెజ్లింగ్‌లో 1952లో కేడీ జాదవ్ మాత్రమే పతకం సాధించి ఉండడం గమనార్హం.

బీజింగ్‌లో బుధవారం జరిగిన రెపిచేజ్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన స్కావబ్, బెలారస్‌కు చెందిన బాట్యోరవ్‌లను కూడా సుశీల్ ఎదుర్కొన్నాడు. అయితే ఉదయం జరిగిన ప్రారంభ రౌండ్లో‌ మాత్రం ఉక్రెయిన్ రెజ్లర్ ఆండ్రీ స్టాడ్నిక్ చేతిలో 3-8 తేడాతో సుశీల్ ఓడిపోవడం గమనార్హం.

తొలి రౌండ్‌లో ఓడిపోయినా సుశీల్ కుమార్ రెపిచేజ్ మ్యాచ్‌లకు అర్హత సాధించాడు. ఈ రెపిచేజ్ మ్యాచ్ మూడు రౌండ్లలో జరగగా తొలి రౌండ్లో సుశీల్ కుమార్ అమెరికాకు చెందిన స్కావబ్‌ను ఓడించాడు. అనంతరం రెండో రౌండ్లో బెలారస్‌కు చెందిన బాట్యోరవ్‌ చేతిలో సుశీల్ కంగు తిన్నాడు.

చివరగా నిర్ణయాత్మక మూడౌ రౌండ్లో కజకిస్థాన్ రెజ్లర్‌తో తలపడిన సుశీల్ ప్రత్యర్థిపై 2-1, 0-1, 1-0 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో బీజింగ్ ఒలింపిక్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించిన వీరుడిగా సుశీల్ అందరి దృష్టినీ ఆకర్షించాడు.
మరిన్ని
ఒలింపిక్‌లో భారత్‌కు రెండో పతకం
ఒలింపిక్ మారథాన్ స్విమ్మింగ్ విజేత ఇల్చెంకో
బీజింగ్‌లో నేడు జితేందర్, విజేందర్‌ల క్వార్టర్స్ పోరు
ఒలింపిక్‌లో భారత్ : ముగిసిన శరత్ ముచ్చట
స్వర్ణ విజేత బింద్రాకు కేంద్ర ప్రభుత్వ నజరానా
ఒలింపిక్ బాస్కెట్ బాల్ : సెమీస్‌ చేరిన చైనా