ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్‌లో పాల్గొన్న వికలాంగురాలిగా నథాలీ రికార్డు
ఒలింపిక్‌లో పాల్గొన్న తొలి వికలాంగురాలిగా స్విమ్మర్ నథాలీ డ్యుటొయిట్ చరిత్ర సృష్టించింది. బీజింగ్‌లో బుధవారం జరిగిన 10 కి.మీ. మారథాన్ స్విమ్మింగ్‌లో 16వ స్థానంలో నిలవడం ద్వారా తనలో సత్తాకు ఏమాత్రం కొదవలేదని ఆమె నిరూపించింది.

వికలాంగురాలైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే తన కోరిక ఈ విధంగా నెరవేరినందుకు సంతోషంగా ఉందని పోటీల అనంతరం నథాలీ పేర్కొంది. తాను వికలాంగురాలైనా ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నదే తన కోరిక అని ఆమె వ్యాఖ్యానించింది.

అయితే బీజింగ్ ఒలింపిక్స్‌లో 16వ స్థానంలో నిలిచినా గతంలో 2004లో జరిగిన పారా ఒలింపిక్స్‌లో నథాలీ ఆరు స్వర్ణ పతకాలు గెల్చుకోవడం గమనార్హం.
మరిన్ని
ఒలింపిక్ మహిళల హాకీ : ఫైనల్‌లో చైనా, నెదర్లాండ్స్
ఒలింపిక్ రెజ్లింగ్‌ : తొలి రౌండ్‌లో రాజివ్ ఓటమి
బీజింగ్ ఒలింపిక్స్‌లో 'బోల్ట్' డబుల్ ధమాకా
బీజింగ్ ఒలింపిక్‌లో పట్టుబడిన మరో డోపీ
ఒలింపిక్ చరిత్రలో అఫ్ఘన్‌కు తొలి పతకం
సెమీస్‌లో విజేందర్ : భారత్ ఖాతాలో మూడో పతకం