ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్ స్వర్ణం నా లక్ష్యం : విజేందర్
బీజింగ్ ఒలింపిక్ బాక్సింగ్ పోటీల్లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకున్న విజేందర్ స్వర్ణ పతకమే తన లక్ష్యం అని పేర్కొంటున్నాడు. భారత్ తరపున బాక్సింగ్ సెమీస్‌లోకి ప్రవేశించిన విజేందర్ స్వర్ణం గెల్చుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని తెలిపాడు.

క్వార్టర్స్ విజయం అనంతరం విజేందర్ మాట్లాడుతూ క్వార్టర్స్‌లో గెలవడానికి తాను ఎంత పట్టుదల ప్రదర్శించానో సెమీ ఫైనల్‌లో సైతం అదే పట్టుదల ప్రదర్శిస్తానని పేర్కొన్నాడు. సెమీస్‌లో ప్రత్యర్ధి గురించి వారి బలాల గూర్చి తాను ఆలోచించడం లేదని సెమీస్‌లో విజయం సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

భారత తరపున ముగ్గురు బాక్సర్లు క్వార్టర్స్‌కు చేరగా అందులో 75 కేజీల విభాగంలో పోటీపడిన విజేందర్ మాత్రమే సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీస్‌కు చేరడం ద్వారా విజేందర్ అటుపై పోటీల్లో గెలవకపోయినా కాంస్య పతకం ఖచ్చితం అన్న విషయం కూడా తెలిసిందే.

అయితే వచ్చిన దాంతో సంతృప్తి పడకుండా స్వర్ణం కోసం పోరాడుతానని విజేందర్ పేర్కొనడం గమనార్హం. బీజింగ్‌లో శుక్రవారం జరగనున్న సెమీస్ పోటీలో క్యూబా బాక్సర్ ఎమిలియో కరియా డయాక్స్‌తో విజేందర్ తలపడనున్నాడు.
మరిన్ని
ఒలింపిక్ బీచ్ వాలీబాల్ : అమెరికాకు స్వర్ణం
ఒలింపిక్ టీటీలో క్వార్టర్స్ చేరిన అమెరికా
ఒలింపిక్ సెయిలింగ్‌లో బ్రిటన్‌కు స్వర్ణం
ఒలింపిక్ వీరులకు నగదు పురస్కారాల వెల్లువ
ఒలింపిక్‌లో పాల్గొన్న వికలాంగురాలిగా నథాలీ రికార్డు
ఒలింపిక్ మహిళల హాకీ : ఫైనల్‌లో చైనా, నెదర్లాండ్స్