ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్ వాలీబాల్ : ఫైనల్‌లో అమెరికా
బీజింగ్ ఒలింపిక్‌లోని మహిళల వాలీబాల్ విభాగంలో అమెరికా ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో ప్రపంచ ఛాంపియన్ క్యూబాను ఓడించడం ద్వారా అమెరికా జట్టు తుది పోరుకు సిద్ధమైంది.

సెమీ ఫైనల్‌లో క్యూబాపై 25-20, 25-16, 25-17 తేడాతో విజయం సాధించడం ద్వారా అమెరికా సెమీస్‌కు దూసుకెళ్లింది. గత 1948లో రజత పతకం గెల్చిన తర్వాత అమెరికా మహిళా వాలీబాల్ జట్టు మరోసారి ఆ స్థాయి ప్రదర్శనను ప్రస్తుత బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రమే కనబర్చడం గమనార్హం.

అలాగే సెమీస్‌లో అమెరికా చేతిలో ఓడిపోయిన క్యూబా గతంలో 1992, 1996, 2000లలో స్వర్ణ పతకాలు చేజిక్కించుకున్న క్యూబా గత 2004లో జరిగిన ఏథేన్స్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే తాజా ఒలింపిక్స్‌లో అనేక అంచనాలతో బరిలో దిగిన క్యూబా మళ్లీ కాంస్య పతకానికే పరిమితమవడం విశేషం.
మరిన్ని
ఒలింపిక్ స్వర్ణం నా లక్ష్యం : విజేందర్
ఒలింపిక్ బీచ్ వాలీబాల్ : అమెరికాకు స్వర్ణం
ఒలింపిక్ టీటీలో క్వార్టర్స్ చేరిన అమెరికా
ఒలింపిక్ సెయిలింగ్‌లో బ్రిటన్‌కు స్వర్ణం
ఒలింపిక్ వీరులకు నగదు పురస్కారాల వెల్లువ
ఒలింపిక్‌లో పాల్గొన్న వికలాంగురాలిగా నథాలీ రికార్డు