బీజింగ్ ఒలింపిక్ పోటీల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నడక సాధించిన రష్యా క్రీడాకారిణి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. లక్ష్య సాధనలో వర్షాన్ని సైతం లెక్కచేయని ఈ క్రీడాకారిణి చివరకు స్వర్ణ పతక విజేతగా నిలిచింది.
బీజింగ్‌లో గురువారం జరిగిన 20 కిలోమీటర్ల నడక పోటీల్లో రష్యాకు చెందిన ఓల్గా గంటా 26 నిమిషాల 31 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి స్వర్ణాన్ని సాధించింది. అలాగే ఈ పోటీలో నార్వేకు చెందిన ప్లాట్జర్ రజతాన్ని సొంతం చేసుకుంది. ప్లాట్జర్ గంటా 26 నిమిషాల 67 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది.
ఇక గంటా 26 నిమిషాల 73 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా ఇటలీకి చెందిన ఎలిసా రిగౌడో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని గెల్చుకుంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఏథనేసియా సౌమెలికా మాత్రం తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం.
ఈ పోటీ జరుగుతున్న సమయంలో బీజింగ్ వర్షంలో తడిసి ముద్దవుతున్నా క్రీడాకారిణిలు మాత్రం పోటీ కొనసాగించడం విశేషం.
|