ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్ అథ్లెటిక్స్ : తిరుగులేని విజేతగా జమైకా
చూడడానికి చిన్న ద్వీప దేశమైనా బీజింగ్ ఒలింపిక్స్‌లో జమైకా తన సత్తా చూపుతోంది. అథ్లెటిక్స్ విభాగంలో అగ్రరాజ్యం అమెరికా పతకాల వేటకు చెక్ చెప్పిన జమైకా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాల్లో తనకు తానే సాటి అంటూ ముందుకు వెళుతోంది.

ఒలింపిక్ ట్రాక్‌పై సుడిగాలి వేగంతో పరిగెత్తి 100, 200 మీటర్ల పరుగులో రికార్డు సృష్టించడంతో పాటు రెండు స్వర్ణాలను కొల్లగొట్టిన జమైకా వీరుడు ఉసెన్ బోల్ట్ స్ఫూర్తితో జమైకా మహిళా అథ్లెట్లు సైతం పతకాల వేటలో ముందు నిలిచారు. బీజింగ్‌లో గురువారం జరిగిన మహిళల 100, 200, 400 మీటర్ల పరుగులో జమైకా క్రీడాకారిణిలు తమ సత్తా చాటారు.

ప్రత్యర్థులు ఊహించలేని వేగంతో పరుగులు సాధించిన జమైకా క్రీడాకారిణులు మూడు విభాగాల్లోనూ స్వర్ణ పతకాలను ఎగరేసుకు పోయారు. జమైకాకు చెందిన షెల్లీ ఫ్రేజర్ 100మీటర్లు, వెరోనికా క్యాంప్‌బెల్ 200 మీటర్లు, వాకర్ మెలైన్ 400మీటర్ల హార్డిల్స్‌లో స్వర్ణాలు సాధించారు.

దీంతో 100, 200 మీటర్ల స్ప్రింట్‌లో మహిళల, పురుషుల విభాగాల్లోని నాలుగు స్వర్ణాలను సొంతం చేసుకున్ని తొలి దేశంగా జమైకా రికార్డు సృష్టించింది. అంతే కాదు ఈ విభాగాల్లోని ఓ రజతం, రెండు కాంస్యాలు కూడా జమైకా ఖాతాలో చేరాయి. దీంతో కేవలం ఈ రెండు విభాగాల్లోనే ఏడు పతకాలు జమైకా ఖాతాలో చేరడం గమనార్హం.
మరిన్ని
ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యంగా జడివానలో నడక
ఒలింపిక్ వాలీబాల్ : ఫైనల్‌లో అమెరికా
ఒలింపిక్ స్వర్ణం నా లక్ష్యం : విజేందర్
ఒలింపిక్ బీచ్ వాలీబాల్ : అమెరికాకు స్వర్ణం
ఒలింపిక్ టీటీలో క్వార్టర్స్ చేరిన అమెరికా
ఒలింపిక్ సెయిలింగ్‌లో బ్రిటన్‌కు స్వర్ణం