కోమాలో ప్రముఖ హాస్యనటుడు సుధాకర్..!

SELVI.M|
ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ కోమాలో ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సుధాకర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో సుధాకర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంకా అపస్మారక స్థితి (కోమా)లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై 48 గంటల దాటితేగాని తామేమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.

ఇకపోతే.. జూన్ 29న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సుధాకర్ ప్రస్తుతం కోమాలో ఉన్నారని వైద్యులు విలేకరులతో చెప్పారు. శరీరమంతా ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. ఇంకా ఇన్‌ఫెక్షన్ మెదడుకు వ్యాపించడంతో ఆయన శరీరంలో కొన్ని కణాలు కూడా పనిచేయడం లేదని వైద్యులు వెల్లడించారు.

కోమాలో ఉన్న సుధాకర్‌ను ఆదివారం సాయంత్రం ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, మా అధ్యక్షుడు మురళీమోహన్ తదితర సినీ ప్రముఖులు పరామర్శించారు.


దీనిపై మరింత చదవండి :