మధ్యంతర ఎన్నికలు ఎపుడైనా రావచ్చు: హరీష్ రావు

Hanumantha Reddy|
మధ్యంతర ఎన్నికలు ఎపుడైనా రావచ్చని.. ఇందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలంగాణా రాష్ట్ర సమితి నేత హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణా హక్కుల కోసం రాజ్యాంగాన్నైనా సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించడం సబబు కాదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.

విలేకరులతో హరీష్ రావు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించడంపై తెలంగాణా సంఘాలు విస్మయం వ్యక్తం చేశాయన్నారు. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా సుప్రీం కోర్టు చేసిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తామన్నారు. తమకు న్యాయం జరగకపోతే.. 1969 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు.


దీనిపై మరింత చదవండి :