గణతంత్ర దినోత్సవానికి ముందే తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్షానికి ముందే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరో రెండు రోజుల్లో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.