ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు.. ఎక్కడ?

woman
జె| Last Modified మంగళవారం, 18 డిశెంబరు 2018 (10:04 IST)
యువకుడిని గాఢంగా ప్రేమించింది. తానే అన్నీ అనుకుంది. విద్యలో అతను చూపుతున్న ప్రతిభ చూసి ఆశ్చర్యపోయింది. అయితే పైలెట్ శిక్షణలో ఉన్న యువకుడికి డబ్బు అవసరమైంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో కుమిలిపోతున్న ప్రియుడిని చూసి జాలి పడింది. తన ఇంట్లో తానే దొంగగా మారిపోయింది.

గుజరాత్ లోని భక్తినగర్‌లో నివాసముంటున్న ప్రియాంకా పర్సానా, హేత్ షా గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. హేత్ షా బెంగుళూరులో పైలెట్ శిక్షణ పొందుతున్నాడు. అయితే పైలెట్ శిక్షణలో ఫీజు కట్టేందుకు 20 లక్షల రూపాయలు అవసరమైంది. నెల రోజులుగా డబ్బులు కట్టకపోవడంతో పాటు ఆవేదనకు గురయ్యాడు హేత్ షా.

ప్రియుడు పడుతున్న ఆవేదనకు జాలిపడింది ప్రియాంకా. తన ఇంట్లో ఉన్న 90 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను దొంగతనం చేసి హేత్ షాకు ఇచ్చింది. బీరువాను చిందర వందర వేసి దొంగతనం జరిగిందని కట్టు కథ అల్లింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి దొంగ తన కూతురేనని తేల్చారు. దీంతో తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు.దీనిపై మరింత చదవండి :