గురువారం, 12 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 15 డిశెంబరు 2025 (21:40 IST)

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Ayyappa Swami Maha Padi Puja
శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో శ్రీ అయ్యప్పస్వామివారి మహాపడి పూజను నిర్వహించారు. తన సతీమణితో కలిసి మంత్రి భక్తిశ్రద్ధలతో ఈ పూజను చేసారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలుపుతూ... ప్రజలందరికీ శ్రేయస్సు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
 
మహాపడి పూజ అనేది శబరిమల యాత్రలో పదునెట్టాంబడి... అంటే 18 మెట్లు ఎక్కేందుకు ముందు లేదా ఎక్కిన తర్వాత చేసే ఒక ప్రత్యేకమైన పూజ. శబరిమలలోని 18 మెట్లు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఈ 18 మెట్లు 18 దేవతలకు, 18 శాస్త్రాలకు లేదా మానవుడు అధిగమించాల్సిన 18 కోరికలు లేదా దోషాలకు ప్రతీకలుగా భావిస్తారు. వీటిలో మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలకు, తర్వాతి ఎనిమిది రాగాలు లేదా లోపాలకు, తర్వాత మూడు గుణాలకు, చివరి రెండు విద్యా-అవిద్యలకు ప్రతీకగా చెబుతారు. అలా ఈ మెట్లను ఎక్కి అయ్యప్పను దర్శించడం అనేది జీవాత్మ పరమాత్మను చేరడానికి చేసే ప్రయత్నంగా భావిస్తారు.