శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (10:44 IST)

పాకిస్థాన్ బోర్డర్‌ను తలపిస్తున్న తుళ్ళూరు - భారీగా పోలీసు బలగాలు

అమరావతి ప్రాంతమైన తుళ్లూరు ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దులను తలపిస్తోంది. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమ రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దీంతో ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని పోలీసు బలగాలతో అణిచివేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. 
 
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ ట్వీట్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. "రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయి. పాకిస్థాన్ బోర్డర్‌లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరు. అన్యాయంగా, క్రూరంగా పోలీసు బలంతో ఉద్యమాన్ని అణిచివెయ్యాలని జగన్‌ యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు. 
 
వైకాపా ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలి" అని ట్వీట్ చేశారు. అలాగే, రైతులు చేపట్టిన ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతునిచ్చిందని ఆయన గుర్తుచేశారు.