బుధవారం, 18 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2025 (13:17 IST)

నకిలీ మద్యం తయారీ కేసు : టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్టు

jayachandrareddy
నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న జయచంద్రారెడ్డిని బెంగుళూరులో ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా ములకలచెరువులో ఈ నకిలీ మద్యం తయారీ దందా బయటపడిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే 31 మంది పోలీసులు అరెస్టు చేశారు. తాజా అరెస్టుతో ఈ సంఖ్య 32కు చేరింది. 
 
నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌ రావుకు జయచంద్రా రెడ్డి ఆర్థిక సహకారం, అండదండలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం తయారీ వ్యవహారమంతా ఆయన కనుసన్నల్లోనే సాగినట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 
 
ఈ కేసులో ఇప్పటివరకు 31 మంది నిందితులను అరెస్టు చేయగా జయచంద్రా రెడ్డి అరెస్టుతో ఆ సంఖ్య 32కి చేరింది. ఆయనను మదనపల్లె ఎక్సైజ్‌ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించనున్నట్లు సమాచారం. కాగా, ఇదే కేసులో వైకాపాకు చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.