సోమవారం, 16 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2025 (19:53 IST)

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

woman victim
నల్లగా ఉందని భర్త, అశుభాలు జరుగుతున్నాయని అత్తమామలు ఈసడింపులు అంతా కలిసి ఓ వివాహితను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఈ దారుణ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలోని తిమ్మాయపాలెంలో చోటుచేసుకుది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన గుంతనాల వెంకటనారాయణ, హనుమాయమ్మ దంపతుల కుమార్తె గోపి లక్ష్మిని, వినుకొండ పట్టణంలోని చౌడమ్మ వీధికి చెందిన వినుకొండ వెంకటేశ్వర్లు, శేషమ్మల కుమారుడు కోటేశ్వరరావుతో గత జూన్‌ 4న వివాహం చేశారు. రెండు నెలలు కాపురం సజావుగానే జరిగింది. మూడో నెల నుంచి నల్లగా ఉన్నావని భర్త, ఇంట్లో అడుగుపెట్టిన దగ్గరి నుంచి అశుభాలు జరుగుతున్నాయని అత్తమామలు వేధించసాగారు. 
 
వివాహ సమయంలో తన తల్లిదండ్రులు రెండు ఎకరాల పొలం అమ్మి.. రూ.12 లక్షల నగదు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చినా, అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారు. దీంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి పెద్దమనుషులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే అత్తవారింటి ముందు నిరసన తెలుపుతుంటే.. ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. గోపి లక్ష్మి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు.