1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 జులై 2025 (18:14 IST)

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

crime
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. భార్యను అనుమానంతో భర్త పొట్టనబెట్టుకున్నాడు. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఉషపై అనుమానంతో లోకేశ్వర్ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. గత నెల 30న భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో పిల్లల్ని తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లింది. 
 
ఈ కోపంతో పనికి వెళ్తున్న ఉషను వెంబడించి మరీ కత్తితో దాడి చేశాడు. భార్యను గొంతుకోసి హతమార్చిన అనంతరం నేరుగా ఇంటికెళ్లి ఉరేసుకున్నాడు లోకేశ్వర్. 
 
దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.