విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మహాకవి శ్రీశ్రీ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య శ్రీశ్రీ ప్రస్థానత్రయం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని రోశయ్య ఆవిష్కరించగా, శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ స్వీకరించారు.