ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15వ తేదీని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాతి, కులం, మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతిఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే వేడుక పంద్రాగస్టు పండుగ. మన జాతీయ పతాకాన్ని ఎలాబడితే అలా ఎగురవేయకూడదు. అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్దేశించిన నిర్ధిష్టమైన ఆదేశాలకు కట్టుబడి ఉండి, ఐ.యస్.ఐ మార్కుని కలిగి ఉండాలి. మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం సమంజసం.