ఆరోపణలు చేయడం కేసీఆర్ నైజం: వీరప్ప మొయిలీ

PNR| Last Modified గురువారం, 8 అక్టోబరు 2009 (18:26 IST)
మనస్సు మారినపుడల్లా సంచలన ఆరోపణలు చేయడం తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అలవాటని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అన్నారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎల్పీ సమావేశం ఎపుడు ఏర్పాటు చేయాలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.

ఇందులో ఎలాంటి తొందరపాటు లేదన్నారు. వైఎస్ దుర్మరణం అనంతరం రాష్ట్రంలో సుస్థిర పాలన అందించడమే తమ ధ్యేయమన్నారు. ఆ లక్ష్యం దిశగా తాము చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా, సీఎల్పీ సమావేశం ఏర్పాటులో ఎవరి ఒత్తిళ్ళకు అధిష్టానం తలొగ్గబోదని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే మనస్సు మారినపుడల్లా కేసీఆర్ విమర్శలు చేయడం సహజమేనన్నారు. ఆయనకు ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని మొయిలీ జోస్యం చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జలయజ్ఞం పనులపై కేసీఆర్ ఆరోపణలు చేయడాన్ని మొయిలీ ఖండించారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.


దీనిపై మరింత చదవండి :