చౌకబారు ప్రచారం వైఎస్ మానుకోవాలి: బాబు

PNR| Last Modified బుధవారం, 5 ఆగస్టు 2009 (19:18 IST)
రాష్ట్రంలోని విపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చౌకబారు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఇలాంటి దుష్ప్రచారానికి ఆయన స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే.రోజా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రాయబారాలు నడుపుతున్నారని ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించి సంచలనం సృష్టించారు.

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. విపక్ష పార్టీలను బలహీన పరిచేందుకు సీఎం ఎలాంటి ప్రచారానికైనా పాల్పడుతారని ఆయన దుయ్యబట్టారు. ఇతర పార్టీల అభివృద్ధిని సహించలేని ఫ్యూడల్ మనస్తత్వం ఆయనదని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి చర్యలకు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.


దీనిపై మరింత చదవండి :